: లోక్ సభ నిరవధిక వాయిదా
లోక్ పాల్ బిల్లును సభ ఆమోదించిన అనంతరం నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి మీరాకుమార్ ప్రకటించారు. అంతకు ముందు లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది. అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోకపోవడంపై సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం సమీపానికి దూసుకెళ్లి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. ఉద్దేశపూర్వకంగానే అవిశ్వాసం నోటీసును స్పీకర్ పక్కనపెట్టారని వారు ఆరోపించారు.