: ఎన్నికల్లోపు లోక్ పాల్ బిల్లు అమలు చేయాలి: అన్నాహజారే
రెండేళ్లుగా లోక్ పాల్ బిల్లుకోసం తీవ్రంగా పోరాటం చేశామని హక్కుల ఉద్యమ కర్త అన్నా హజారే అన్నారు. రాలెగావ్ సిద్దిలో దీక్ష విరమించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయితే ఇది ఆరంభం మాత్రమేనని, బలమైన లోక్ పాల్ బిల్లును ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. లోక్ పాల్ తో అవినీతి నిర్మూలన జరగకపోయినా.. ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఆనందంగా ఉందన్నారు. లోక్ పాల్ బిల్లు ఆమలులోకి వచ్చాక ప్రజా జీవితం కాస్తయినా మెరుగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తీర్చడంలో లోక్ పాల్ బిల్లు కాస్తయినా ఉపయోగపడుతుందని అన్నాహజారే అన్నారు. రానున్న ఎన్నికల్లోపు లోక్ పాల్ బిల్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.