: లాలూ కాన్వాయ్ లో వాహనానికి ప్రమాదం.. ఒకరి మృతి


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాన్వాయ్ లో ఒక వాహనం ప్రమాదానికి గురైంది. రాంచీ నుంచి పాట్నాకు వెళుతున్న లాలూ కాన్వాయ్ లో ఒక వాహనం కొడెర్మ వ్యాలీ వద్ద నిన్న సాయంత్రం 20 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన ఏడుగురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. తన కాన్వాయ్ లోని వాహనం ప్రమాదానికి గురైన విషయం లాలూకి పాట్నాకు చేరిన తర్వాత గానీ తెలియలేదు. ఆయన వాహనం ముందుండడమే కారణం. కొడెర్మ వ్యాలీ అత్యంత ప్రమాదకరమైనది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్తగా లేకపోవడమే వాహన ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News