: దీక్ష విరమించిన అన్నా హజారే
లోక్ పాల్ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో గత తొమ్మిది రోజులుగా నిరవధిక దీక్ష చేపట్టిన అన్నాహజారే దీక్ష విరమించారు. ఈ సందర్భంగా, అవినీతిపై దేశం సాధించిన తొలి విజయంగా అన్నా వ్యాఖ్యానించారు. కాగా లోక్ పాల్ బిల్లు ఆమోదంతో అన్నా స్వగ్రామం రాలెగావ్ సిద్ధిలో పండుగ వాతావరణం నెలకొంది. బిల్లు ఆమోదం పొందడంతో అన్నా హజారే మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.