: బతికించిన రిజర్వ్ బ్యాంకు


రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను ఏ మాత్రం కదిలించకుండా యథాతథంగా వదిలివేసింది. రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పారిశ్రామిక, బ్యాంకింగ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. వాస్తవానికి ఇటీవల ద్రవ్యోల్బణం పగ్గాలు తెంచుకుని పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో కీలక రేట్లను రిజర్వ్ బ్యాంకు పెంచుతుందనే భయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే దేశంలో వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. పారిశ్రామిక రంగంపై రుణాల వడ్డీ భారం పెరిగిపోతోంది. రుణ లభ్యత కూడా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో రేట్లు మరింత పెరిగితే గడ్డుకాలమేనని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, ఇప్పటికే డిపాజిట్ల సేకరణ కష్టంగా ఉందని, వడ్డీ రేట్లు పెరిగితే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని బ్యాంకింగ్ వర్గాలు కూడా చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను కదిలించకుండా ఉంచినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News