: హైదరాబాద్ నడిబొడ్డున కారు దగ్ధం
హైదరాబాద్ నగరం నడిబొడ్డున కారు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. సౌకర్యానికి కొనుక్కున్న కార్లు వరుసగా దగ్ధమవుతుండడంతో నగరవాసులు కలవరపడుతున్నారు. గత మూడు రోజుల్లో ఐదు కార్లు దగ్ధమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు వాహనాల్లోని వారంతా ప్రాణాలతో బయటపడడం ఆనందం కలిగిస్తున్నా.. జరుగుతున్న ప్రమాదాలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఈ ఉదయం నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ లో ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా, ఇదే ప్రాంతంలో గత ఏడాది రెండు కార్లు దగ్ధమయ్యాయి.