: భారత్ లో అవినీతి మకిలి అంటని ముఖ్యమంత్రి ఆయన


దేశంలోనే పేద ముఖ్యమంత్రి అంటూ తనను పేర్కొనడం పట్ల సంతోషంగా ఉందని.. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. అలా అంటే తనకు ఇబ్బందేమీ అనిపించడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ముఖ్యమంత్రులు పదులు, వందల సంఖ్యలో కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉంటే.. మాణిక్ సర్కార్ కు కేవలం 2.5లక్షల రూపాయల ఆస్తులే ఉండడం గమనార్హం. గత ఎన్నికల సందర్భంగా మాణిక్ అఫిడవిట్ దాఖలు చేసే సమయానికి ఆయన చేతిలో వెయ్యి రూపాయలే నగదు ఉంది.

ఇంత నిజాయతీగా ఎలా ఉండగలుగుతున్నారన్న ప్రశ్నకు.. అది తన పార్టీ (సీపీఎం) నేర్పిన సంస్కృతి అని చెప్పారు. త్రిపుర రాష్ట్రానికి వరుసగా నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కారు కొనసాగుతున్నారు. దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పదవులను అలకరించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. త్రిపురలో ఇంత ప్రజాదరణ ఎలా సాధ్యం? అన్న ప్రశ్నకు.. ఏమీ దాచమని, అంతా పారదర్శకంగా ఉంచడమే విజయ రహస్యంగా మాణిక్ సర్కారు చెబుతారు.

  • Loading...

More Telugu News