: రియాలిటీ షో నటుల లొల్లి.. బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ అరెస్టు
బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటిష్ పాకిస్తానీ నటి సోఫియా హయత్ ఫిర్యాదు మేరకు లోనావాలా లోని బిగ్ బాస్ హౌస్ నుంచి అర్మాన్ ను పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో తీసుకెళ్లారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండగా తనను బూతులు తిట్టి, కొట్టాడంటూ అర్మాన్ కోహ్లీపై సోఫియా హయత్ ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అర్మాన్ పై ఐపీసీ సెక్షన్ 324, 504, 509, 506, 354లపై కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక వేధింపుల నుంచి ప్రమాదకర ఆయుధాలతో గాయపర్చడం వంటి నేరాలున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షోలో సోఫియాతో తనీషా ముఖర్జీ, ఇజాజ్ ఖాన్ లు కూడా గొడవపడినా అర్మాన్ తో జరిగిన గొడవ చిలిచిలికి గాలివానగా మారి వ్యక్తిగత కక్షగా మారింది.