: గూగుల్ కొత్త బిజినెస్.. రోబోలు
ఇంటర్నెట్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. రోబోల తయారీ వ్యాపారంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తు అంతా రోబోల యుగమేనని భావించిన ఈ కంపెనీ గడచిన ఏడాది కాలంలో ఎనిమిది రోబో తయారీ, పరిశోధన కంపెనీలను కొనుగోలు చేసింది. తాజాగా పేరొందిన బోస్టన్ డైనమిక్స్ ను కూడా సొంతం చేసుకుంది. గూగుల్ ఆండ్రాయిడ్ ప్రాజెక్టు హెడ్ గా ఉన్న ఆండీ రూబిన్ ఆధ్వర్యంలో రోబో గూగుల్ అసెంబుల్డ్ డివిజన్ పరిశోధన, తయారీ దిశగా అడుగులు వేయనుంది. భవిష్యత్తు అద్భుతం అంటూ రూబిన్ బోస్టన్ డైనమిక్స్ కొనుగోలు అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు.