: తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నారు: చంద్రబాబు


ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కాంగ్రెస్ కారణంగా జరుగుతున్నవేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎందుకు శాసనసభకు రాలేదని, స్పీకర్ ఎందుకు మధ్యలో వెళ్లిపోయారని చాలా మంది అడుగుతున్నారని.. దాని గురించి చాలా వినిపిస్తున్నాయని అయినా తాను వాటి గురించి మాట్లాడనని బాబు అన్నారు.
ఇప్పటికీ జగన్ ను దిగ్విజయ్ సింగ్ తన కుమారుడిలాంటి వాడేనని అంటున్నాడని, టీఆర్ఎస్ ను విలీనం చేస్తామని అంటున్నాడని గుర్తు చేశారు. వీరంతా కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు పూనుకున్నారని అన్నారు. ఒక్కటిగా ఉన్న తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News