: టీ-బిల్లుపై పెల్లుబికిన నిరసన... శాసన మండలి రేపటికి వాయిదా


తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసన మండలిలోనూ నిరసన పెల్లుబికింది. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతల నిరసనలతో ఇవాళ సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి సభను రేపటికి (మంగళవారం) వాయిదా వేశారు. అయితే, వాయిదా పడిన తరువాత కూడా ఎమ్మెల్సీలు మండలి బయట ఆందోళనలు చేపట్టారు. దీంతో తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకొన్నాయి. ఈ తోపులాటలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు. ఇరు ప్రాంత ఎమ్మెల్సీలకు సర్దిచెప్పలేక పోలీసులు తంటాలు పడ్డారు. అనంతరం నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన పూర్తికాక మునుపే తమ ప్రాంత సభ్యులపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విభజన జరిగిన తర్వాత మహిళల భద్రత పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News