: వివరణ ఇవ్వాలంటూ సోనియాకు యూఎస్ కోర్టు ఆదేశాలు
1984లో ఇందిరా గాంధీ మరణానంతరం సిక్కులపై జరిగిన దమనకాండకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలను కాపాడుతున్నారని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై ఆరోపణలు వచ్చాయి. సిఖ్క్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఆమెపై యూఎస్ కోర్టులో ఫిర్యాదు నమోదు చేసిన విషయం విదితమే. దీనికి సంబంధించి సోనియాగాంధీ జనవరి 2వ తేదీ లోపు వివరణనివ్వాలని న్యూయార్క్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఇంతకు ముందు సోనియా న్యూయార్క్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్న సమయంలో ఆమెకు ఈ కేసుకు సంబంధించిన సమన్లు అందజేశారు.