: లోక్ పాల్ బిల్లు కోసం పార్లమెంటు సమావేశాలు పొడిగిస్తాం: కమల్ నాథ్
లోక్ పాల్ బిల్లు ఆమోదానికి అవసరమైతే పార్లమెంటు సమావేశాలను కూడా పొడిగిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ లోక్ పాల్ బిల్లుకు తాము అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. లోక్ పాల్ బిల్లు ఆమోదానికి అడ్డంకిగా మారిన సమాజ్ వాదీ పార్టీని కూడా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కమల్ నాథ్ చెప్పారు.