: విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్
కృష్ణాజిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఆర్టీసీ బస్సు నూజివీడు మండలం రామన్నగూడెం వద్దకు రాగానే డ్రైవర్ కు గుండె పోటు వచ్చి అక్కడికక్కడే మరణించాడు. తుదిశ్వాస విడిచే సమయంలోనూ ఆయన అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రాణాపాయ దశలోనూ తమను కాపాడిన డ్రైవర్ మృతికి వారు కన్నీటి వీడ్కోలు పలికారు.