: దీర్ఘకాలం మన్నే బూట్లు


కాలికి ధరించే చెప్పులు, బూట్లు ఏదో ఒక కాలానికి పాడైపోవడం ఖాయం. అందునా వర్షాలకు తడిస్తే అవి మరింత తొందరగా పాడైపోతాయి. అలాకాకుండా ఏళ్ల తరబడి మన్నే బూట్లు వస్తే... అప్పుడు బూట్ల కొనుగోళ్లు తగ్గుతాయి. ఎందుకంటే, ఒకసారి కొన్న బూట్లు ఏళ్ల తరబడి పాడుగాకుండా ఉంటే వాటిని మళ్లీ కొనాల్సిన అవసరం రాదుకదా! ఇలాంటి కొత్తరకం బూట్లను పరిశోధకులు తయారుచేశారు.

రోజూ వ్యాయామంలో భాగంగా రన్నింగ్‌ కొరకు మనం వాడే షూ కొన్నాళ్లకు పాడైపోతాయి. తీవ్రస్థాయిలో ఒరిపిడి కారణంగా అవి పాడవుతాయి. అలాకాకుండా ఎప్పటికప్పుడు తమకు తామే మరమ్మత్తులు చేసుకునే బూట్లను పరిశోధకులు తయారుచేశారు. సింథటిక్‌ బయో పదార్ధాన్ని ఉపయోగించి, త్రీడీ ముద్రణా విధానం ద్వారా ఈ కొత్తరకం బూట్లను తయారుచేశారు. ఇవి ఇంచుమించు రెండవ చర్మంలాగా పనిచేస్తూ మన పాదాలను కంటికి రెప్పలా కాపాడుతాయట. ఇలా చిరకాలం మన్నే బూట్లను ఎవరుమాత్రం ఇష్టపడరు మరి!

  • Loading...

More Telugu News