: చట్టసభల్లో బీసీల ప్రాతినిథ్యం పెరగాలి: డీఎస్
బీసీల్లో దాదాపు 20 కులాలకు ఇప్పటికీ శాసనసభలో ప్రాతినిథ్యం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ తెలిపారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిథ్యం పెరగాలని అన్నారు. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా బీసీ డిక్లరేషన్ చేయాలని చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలతో తమకు విబేధాలు లేవని... అక్కడి నేతలతోనే సమస్య అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం సోనియాగాంధీ ఎంతో కృషి చేశారని చెప్పారు.