: పాశ్చాత్య సంస్కృతికి స్థానం లేదు: బీజేపీ
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 377ను బీజేపీ మరోమారు సమర్థించింది. స్వలింగ సంపర్కం నేరమేనని.. అసహజ లైంగిక కార్యకలాపాలను నిషేధిస్తున్న సెక్షన్ 377లో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం కీలక తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును సమర్థిస్తూ బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ నిన్న మాట్లాడారు. దానిపై పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వి కూడా స్పందించారు. రాజ్ నాథ్ చెప్పింది కరక్టేనని, పాశ్చాత్య సంస్కృతికి ఇక్కడ స్థానం లేదని పేర్కొన్నారు.