: విజయవాడ రైల్వే స్టేషన్లో తుపాకీ కలకలం
విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ ఉదయం ఓ తుపాకీ కలకలం రేపింది. స్టేషన్ బయట ఓ సింగిల్ బ్యారెల్ గన్ ను అక్కడ పనిచేస్తున్న స్వీపర్ గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆగమేఘాల మీద రైల్వే స్టేషన్ కు చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇది సింగిల్ బ్యారెల్ గన్ అని... మేడిన్ ఇండియా అని దాని మీద ఉందని పోలీసులు తెలిపారు. తుపాకీని పార్టులు పార్టులుగా విడదీసి ఉంచారని చెప్పారు. దీన్ని ముఖ్యంగా అడవి జంతువులను వేటాడటానికి ఉపయోగిస్తారని... మనుషులను చంపడానికి కూడా దీన్ని వాడవచ్చని అన్నారు. స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడానకి భయపడే తుపాకిని ఇక్కడ వదిలేసి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ టైపు తుపాకీలను బీహార్ లో ఉపయోగిస్తారని తెలిపారు.