: మధ్యంతర భృతిపై మంత్రి ఆనం హామీ ఇచ్చారు: టీఎన్జీవో నేత దేవీప్రసాద్


ఉద్యోగులతో మంత్రుల ఉపసంఘం సమావేశం ముగిసింది. పీఆర్సీ, మధ్యంతర భృతిపై ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రితో చర్చించి మధ్యంతర భృతిపై నిర్ణయం ప్రకటిస్తామని ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమకు హామీ ఇచ్చారని అన్నారు.

ఈ సమావేశాలకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు కుర్చీ కూడా దొరకని దుస్థితి నెలకొంది. దీంతో అశోక్ బాబు బయటే ఉండిపోయారు. చర్చలకు ప్రతినిధులను పిలిచిన ప్రభుత్వం అందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అశోక్ బాబు అన్నారు.

  • Loading...

More Telugu News