: రూపాయికి కిలో బియ్యం ఫైలుపై తొలి సంతకం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ రూపాయికి కిలో బియ్యం ఫైలుపై తొలి సంతకం చేశారు. పేద ప్రజలకు రూపాయికే కిలో బియ్యం అందజేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించింది. ఇప్పుడు చౌహాన్ ఈ పథకాన్ని అమలు చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏ ఇతర మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చేది లేదని ఆయన అన్నారు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన మరో నాలుగు పథకాలను అమలు చేసే దిశగా చౌహాన్ అడుగులు వేస్తున్నారు. ఆయా పథకాలకు ముఖ్యమంత్రి కేత్-సడక్ యోజన, ఎంపీ వర్గ్ ఆరోగ్య్, వ్యాపార్ సంవర్థన్ మండల్.. పేర్లను ఇప్పటికే ప్రకటించారు. ఇవి జనవరి ఒకటి నుంచి అమలవుతాయి. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని.. ప్రజల కోసం ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల విశ్వసనీయతను నిలబెట్టుకుంటామని చౌహాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News