: భద్రత పేరు చెప్పి బాంబులు కురిపిస్తోంది: అమెరికాపై కార్జాయ్ నిప్పులు


తమ దేశంలో భద్రత కల్పిస్తున్నామని అంతర్జాతీయ సమాజానికి ఓపక్క చెబుతూ, మరోపక్క బాంబుదాడులు చేస్తోందని అమెరికాపై ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కార్జాయ్ నిప్పులు చెరిగారు. ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ ఆది నుంచీ మిత్రదేశంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్ లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ తమ దేశ సైనిక బలగాలను పటిష్ఠం చేసుకునేందుకు భారత్ సహాయం తీసుకుంటామని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానం సరైంది కాదని అన్నారు. అనంతరం కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తో ఆయన సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News