: కేజ్రీవాల్ సాగదీతపై విపక్షాల విమర్శలు
ఏఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము బేషరతుగా మద్దతిస్తామంటున్నా... కేజ్రీవాల్ ఎందుకు ముందుకు రావడంలేదని కాంగ్రెస్, బీజేపీలు ప్రశ్నించాయి. "ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏఏపీ నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. మేము ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఏఏపీకి బేషరతుగా మద్దతివ్వాలని నిర్ణయించాం. అయినా ఏఏపీ బాధ్యతల నుంచి దూరంగా వెళ్లాలనుకుంటోంది" అంటూ కాంగ్రెస్ నేత భక్తచరణ్ దాస్ విమర్శించారు.
ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తామని తెలిపినా... ప్రభుత్వ ఏర్పాటుకు మీకు మరో పది రోజుల సమయం కావాలా? అంటూ కాంగ్రెస్ మరో నేత సంజయ్ ఝా కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించే స్థానంలో ఉన్నప్పటికీ... ఏఏపీ ముందుకు రావడం లేదంటూ బీజేపీ నేత విజేంద్ర గుప్తా అన్నారు. మద్దతు ఇస్తామని రెండు పార్టీలు ప్రకటించినప్పటికీ, ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా వెళుతోందని... ఇది ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదని బిజూ జనతాదళ్ నేత జైపాండా సూచించారు.