: భోపాల్ లో వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీ


మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అద్వానీ, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్లమెంటరీ పార్టీ నేత సుష్మా స్వరాజ్ లతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. నరేంద్ర మోడీతో ఏకంగా గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా, ఏక పక్షంగా ఎలా విభజిస్తూ ఉందో వారికి ఆయన వివరిస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబునాయుడు భోపాల్ వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News