: ప్రజలతో చర్చించాకే బిల్లు అసెంబ్లీలో పెట్టాలి: శైలజానాథ్
తెలంగాణ ముసాయిదా బిల్లులోని అంశాలు ప్రజలకు తెలియజేసి, వారితో చర్చించిన తరువాతే అసెంబ్లీలో చర్చకు పెడితే బాగుంటుందని మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమావేశాలు వరదలు, ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసినవి కాబట్టి ఇప్పుడు వాటిని చర్చించి, తరువాత ప్రత్యేకంగా సమావేశమై బిల్లు గురించి సమగ్రంగా చర్చిస్తే బాగుంటుందన్నారు.