: భారత్ చేతికి అగస్టా కుంభకోణం కీలక పత్రాలు
సంచలనం సృష్టించిన అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తు ఊపందుకుంది. ఆ స్కాంకు సంబంధించిన కీలక పత్రాలను నేడు ఇటలీ.. భారత్ కు అప్పగించింది. ఈ కుంభకోణం యూపీఏ సర్కారుకు తలనొప్పిగా పరిణమించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ఆరంభ దినాల్లో ప్రతిపక్షాలు ఉభయసభలను అట్టుడికించాయి.
దీంతో, కేంద్రం ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్ల కాంట్రాక్టు దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పారన్న ఆరోపణలపై అప్పట్లో ఇటలీ సంస్థ ఫిన్ మెకానికా చైర్మన్ గిస్సెపీ ఓర్సికి గృహనిర్బంధం విధించారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారుల బృందం ఇటలీ వెళ్లింది. తాజాగా భారత్ చేతికి వచ్చిన పత్రాలతో దర్యాప్తు వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. అధికారులు ప్రస్తుతం ఆ పత్రాల్లోని సమాచారాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు.