: ఈ ప్రపంచమంతా పురుషాధిపత్యమే: మాధురీ దీక్షిత్


బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ప్రస్తుతం తన తాజా చిత్రం 'దేడ్ ఇష్కియా' ప్రమోటింగ్ లో చాలా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ముంబయిలో ఓ విలేకరి ప్రశ్నిస్తూ.. పెళ్లి తర్వాత చాలామంది నటీమణులు తమ పాప్యులారిటీ కోల్పోతున్నారని, ఇందుకు సినీ పరిశ్రమలో పురుషుల ఆధిక్యతే కారణమని అనుకుంటున్నారా? అని అడిగారు. ఇందుకు మాధురీ సమాధాన మిస్తూ.. ఈ ప్రపంచమంతా పురుషాధిపత్యమేనని, అది కేవలం సినీ పరిశ్రమలోనే కాదని పేర్కొంది. అయితే, మహిళ తనదైన మార్క్ కోసం, హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉందని వివరించింది. తనను తాను నిరూపించుకునేందుకు ప్రతిసారీ మహిళ పురుషుడి కంటే రెండింతలు ఎక్కువగా కష్టపడుతుందన్న మాధురీ అదే వాస్తవ జీవితమని తెలిపింది.

  • Loading...

More Telugu News