: స్వలింగ సంపర్కంపై ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచన లేదు: షిండే
స్వలింగ సంపర్కంపై ఇప్పట్లో ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టు నాలుగు రోజుల కిందట తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు, సినీ నటులు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.