: రాష్ట్రంలో రేపటి నుంచి రెవిన్యూ సదస్సులు.. ప్రారంభించనున్న సీఎం
రాష్ట్రంలో రేపటి నుంచి రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. నెలరోజుల పాటు జరగనున్న ఈ సదస్సులను మహబూబ్ నగర్ మండిపల్లిలో రేపు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కాగా, రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవిన్యూ సంబంధిత సమస్యలను ప్రజలు ఈ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని రఘువీరా సూచించారు.