: విదేశీ విద్యార్థుల స్వర్గధామం బెంగళూరే.. తర్వాత హైదరాబాద్!
విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో బెంగళూరు, హైదరాబాద్ పోటీ పడుతున్నాయి. ఏటా భారత్ కు వస్తున్న ప్రతీ ముగ్గురు విదేశీ విద్యార్థుల్లో ఒకరు(36.7శాతం) బెంగళూరు నగరానికే వెళుతున్నారు. మొత్తం 10,100 మంది ఏటా బెంగళూరుకు వస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉంది. ఇక్కడకు ఏటా 4,700 మంది ఉన్నత విద్య కోసం విచ్చేస్తున్నారు. సీఐఐతో కలిసి డెలాయిట్ నిర్వహించిన అధ్యయనం ఈ వివరాలను తెలియజేసింది.