: పోలీసుల్ని చూసి 'ఓవర్ ది మూన్' పబ్ నిర్వాహకుడి పరారీ
నిబంధనలకు తిలోదకాలిచ్చి అర్థరాత్రి వరకు నడుపుతున్న 'ఓవర్ ది మూన్' పబ్ పై పోలీసులు దాడి చేశారు. హైదరాబాదు, మాదాపూర్ లోని ప్రముఖ హోటల్ లో నడుపుతున్న ఓవర్ ది మూన్ పబ్ లో విదేశీయులు సహా 200 మంది అతిథులు ఫుల్ జోష్ లో జల్సా చేసుకుంటున్నారు. వీరిలో కొందరు మద్యం సేవిస్తూ కనిపించారు. దీంతో పోలీసులు ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల్ని చూసిన నిర్వాహకుడు మెల్లగా జారుకున్నాడు. పరారీలో ఉన్న నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.