: ఆ జోడు వెల 64 లక్షలట!


జోడు అంటే కళ్లజోడు అనుకునేరు... కాదు కాలిజోడు... షూ... అది కూడా పాత షూ. అలాంటి వాటికి అంత ధర ఏంటని అనుకుంటున్నారా... అవి ప్రముఖ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు మైకేల్‌ జోర్డాన్‌ ధరించాడు. కాబట్టి వాటికి అంత ధర పలికింది.

1997లో చికాగో బుల్స్‌-ఉతా జాజ్‌ జట్లమధ్య జరిగిన ఎన్‌బీఏ ఫైనల్లో మైకేల్‌ జోర్డాన్‌ వేసుకున్న బూట్లను ఆన్‌లైన్‌లో వేలం వేయగా వాటికి అక్షరాలా రూ.64.57 లక్షల ధర పలికిందట. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో జోర్డాన్‌ ఒక్కడే 38 పాయింట్లు స్కోర్‌ చేశాడు. అప్పట్లో జోర్డాన్‌ ఫ్లూ జ్వరంతో బాధపడుతూ బరిలోకి దిగడం వల్ల ఈ మ్యాచ్‌ 'ఫ్లూ మ్యాచ్‌'గా ప్రసిద్ధి చెందింది. ఈ మ్యాచ్‌ గెలిచిన తర్వాత అప్పట్లో బాల్‌బాయ్‌గా ఉన్న ట్రూమన్‌ మ్యాచ్‌ తర్వాత జోర్డాన్‌ వేసుకున్న నైక్‌ షూలను అడిగిమరీ తీసుకుని 15 ఏళ్లపాటు భద్రపరిచాడు. వీటిని ఆన్‌లైన్‌లో గ్రే ప్లానెల్‌ ఆక్షన్స్‌ సంస్థ విక్రయించగా అవి అంత ధర పలికాయి. అయితే అంత ధర పెట్టి కొన్న అభిమాని ఎవరనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News