: మీ పని ఏంటి?.. మీరేం చేస్తున్నారు?: డీగ్గీ రాజాను నిలదీసిన బాబు
‘కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులైన మీరు చేయాల్సింది ఏంటి? మీరు చేస్తున్నది ఏంటి?’ అని దిగ్విజయ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన మాటలు, రాష్ట్రపతి చేయాల్సిన పనులను డిగ్గీ రాజా ఎలా డిసైడ్ చేస్తారని బాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత ఏం చేస్తారో, ఏం చేయాలో వంటివన్నీ ప్రభుత్వం చెప్పాల్సినవన్న ఆలోచన కూడా లేకుండా, మీరెలా చెబుతారని ఆయన అడిగారు.
అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు మీరు రావాల్సిన అవసరం ఏంటి? అని ఆయన నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగాలన్నది డిగ్గీరాజా ఎలా డిసైడ్ చేస్తారని, బిల్లు అసెంబ్లీలో చర్చకు ఎప్పుడు పెట్టాలనే విషయాలను ఆయన చెప్పడం సరికాదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రపతే జనవరి 23 వరకు గడువు ఇస్తే ఇప్పుడే బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలని చెప్పడానికి మీరెవరని ఆయన ప్రశ్నించారు.