: తెలంగాణ బిల్లును ఓడించి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపాలి: గాలి ముద్దుకృష్ణమ


బిల్లును తీసుకొచ్చిన ప్రత్యేక విమానంలోనే డబ్బు సంచులను కూడా తెచ్చారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి దిగ్విజయ్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వరదల్లో చిక్కుకున్న వారిని పరామర్శించడం కోసం రాని ప్రత్యేక విమానం... బిల్లును తీసుకురావడానికి మాత్రం వచ్చిందని ముద్దుకృష్ణమ ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లును ఓడించి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపాలని సీఎం, స్పీకర్ లను ఆయన కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడానికి కారణమైన దిగ్విజయ్... ఇక్కడేం సాధించాలని వచ్చారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News