: నిలువునా చీలిన ఏపీఎన్జీవోలు.. అశోక్ బాబుపై తిరుగుబాటు


సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఏపీఎన్జీవోలు నిలువునా చీలిపోయారు. సమైక్య ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఏపీఎన్జీవో నేత అశోక్ బాబుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయనపై ఏపీఎన్జీవోలలోని ఒక వర్గం తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. ఉద్యమానికి సంబంధించి ఆయన నియంతలా మారారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏపీఎన్జీవోలలో ఒక వర్గం విమర్శించింది. దాదాపు 11 విభాగాలకు చెందిన ఏపీఎన్జీవోలలోని ఒక వర్గం, ఈసారి ఎన్నికలలో అశోక్ బాబు ప్యానెల్ ను ఓడిస్తామని ప్రకటించారు. ఈ రోజు నాంపల్లిలోని ఓ ప్రాంతంలో భేటీ అయిన రెబెల్ ఏపీఎన్జీవోలు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ ప్రారంభమైన వెంటనే అసెంబ్లీని ముట్టడిస్తామన్న అశోక్ బాబు... విజయవాడకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News