: 'బిగ్ బాస్' షోలో అర్మాన్ నన్ను బూతులు తిడుతూ కొట్టాడు: సోఫియా హయత్


'కలర్స్' టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే రియాలిటీ షో 'బిగ్ బాస్'లో పాల్గొన్న అర్మాన్ కోహ్లీపై బాలీవుడ్ సెక్సిణి సోఫియా హయత్ ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ షోలో పాల్గొన్న సందర్భంగా అర్మాన్ కోహ్లీ తనను బూతులు తిట్టాడని, కొట్టేవాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అర్మాన్ కోహ్లీపై ఐపీసీ సెక్షన్ 323, 324 లపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోనావాలాలో 'బిగ్ బాస్ హౌస్' ఉన్నందున దర్యాప్తుకు కేసును అక్కడి పోలీస్ స్టేషన్ కు పంపించారు. శాంతాక్రజ్ పోలీసులు తన పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించారని సోఫియా ట్విట్టర్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News