: దిగ్విజయ్ ను కలవాలని సీమాంధ్ర నేతలెవరూ అనుకోవడం లేదు: జేసీ


శాసన సభకు విభజన బిల్లు వచ్చినప్పుడు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలందరూ సమష్టిగా వ్యతిరేకిస్తామని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సీమాంధ్రకు చెందిన నేతలెవరూ దిగ్విజయ్ సింగ్ ను కలవాలని కోరుకోవడం లేదని చెప్పారు. అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు రావడం ఆలస్యమైతే, సమైక్యాంధ్ర తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇకపై అంధకారమేనని అన్నారు.

  • Loading...

More Telugu News