: విద్యార్ధులకు ఉచిత ల్యాప్ టాప్ లు పంపిణీ చేసిన యూపీ సీఎం


ఉచిత ల్యాప్ టాప్ పంపిణీ పథకంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈరోజు లక్నోలో పదివేల మంది కళాశాల విద్యార్ధులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారు. వచ్చే శుక్రవారంతో యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేశ్ పదవి చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేశారు. కాగా, రానున్న ఏడాదిన్నర కాలంలో 15 లక్షల ల్యాప్ టాప్ లు విద్యార్ధులకు ఇవ్వడానికి ప్రణాళిక వేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అఖిలేశ్.. ఒక్క సంవత్సరంలోనే ఇన్ని చేశామంటే, ఇక వచ్చే నాలుగేళ్లలో ఎంత చేస్తామో
 మీరే ఊహించాలని అన్నారు. కాగా, విద్యార్ధులకు పంపిణీ చేసిన ల్యాప్ టాప్ లపై అఖిలేశ్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఫోటో ఉండడం గమనార్హం. ఇదిలా ఉంచితే, కొన్ని రోజుల కిందట యూపీలోని అలహాబాద్ యూనివర్శటీలో కొందరు విద్యార్ధుల మధ్య ఈ ల్యాప్ టాప్ ల పంపిణీ విషయమై ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే! 

  • Loading...

More Telugu News