: కేసీఆర్ నోటి దురుసు తగ్గించుకోకపోతే.. నేను కూడా తగ్గను: చంద్రబాబు


రెండు రోజులుగా కేసీఆర్ పై స్వరం పెంచిన చంద్రబాబు, ఈ రోజు కూడా ఆయనపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోటి దురుసును తగ్గించుకోకపోతే తాను కూడా తగ్గనని హెచ్చరించారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం, టీడీఎల్పీ కార్యాలయంలో చంద్రబాబు తమ పార్టీ శాసనసభాపక్షంతో భేటీ అయ్యారు. అనంతరం పై వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో విభజన బిల్లుపై చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ తప్పించుకు తిరుగుతోందని... అందుకే సభను వాయిదాల మీద వాయిదాలతో నెట్టుకొస్తోందని చంద్రబాబు విమర్శించారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసిన గోతిలో తానే పడిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News