: పార్లమెంట్ సమావేశాలను కుదించం: కమల్ నాథ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ స్పష్టం చేశారు. పార్లమెంటులో పెండింగ్ బిల్లులను ఆమోదించాలని, కాబట్టి సభలు కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ మొదటి ప్రాధాన్యత లోక్ పాల్ బిల్లు అని చెప్పారు.