: నేడు హైదరాబాద్ రానున్న దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ నేడు హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఆయన రెండు రోజుల పాటు బస చేస్తారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన మంతనాలు జరపనున్నారు. విభజనకు సంబంధించి వారివారి వాదనలు వినిపించడానికి, అన్ని పార్టీల నేతలు దిగ్విజయ్ ను కలిసే అవకాశం ఉంది. మరోపైపు డిగ్గీరాజా గో బ్యాక్ అంటూ ఏపీఎన్జీవోలు ఆందోళనలు చేపట్టనున్నారు.