: మహారాణి అంటే ఇలాంటి హారం ఉండాల్సిందే...


మహారాణి అంటే... మనకు తెలిసి జోధా అక్బర్‌ సినిమాలో ఐశ్వర్య లాగా బోలెడు నగలు వేసుకుని కనిపిస్తుందా... లేదా రకరకాల హారాలను వేసుకుని కనిపిస్తుందా... ఎలా ఉంటుందో సరిగ్గా మనం అంచనా వేయలేం. కానీ ఈ హారం వేసుకుంటే మాత్రం కచ్చితంగా మీరు మహారాణిలాగానే ఉంటారట. ఎందుకంటే అంత అందంగా, అంత భారీగా ఈ హారాన్ని తయారుచేశారు.

చూసేందుకు పైనుండి కింది వరకూ కనిపించే ఈ హారం... కళ్లు చెదిరిపోయేలా మేలిమి బంగారంతో తయారుచేసింది. దీనిపేరు 'మహారాణి నెక్లెస్‌' అని చెబుతున్నారు విజయవాడలోని జోయాలుక్కాస్‌ సంస్థ వారు. ఈ మహారాణి నెక్లెస్‌ 3.5 కిలోల బంగారంతో తయారుచేశారు. చూసేందుకు బంగారు కవచంలా కనిపించే ఈ హారాన్ని కేరళలోని తిరుచూర్‌ ఫ్యాక్టరీలో ఆభరణ తయారీ కళాకారులు సుమారు 180 రోజుల పాటు శ్రమించి తయారుచేశారట. అన్నట్టు ఇలాంటి మహారాణీ నెక్లెస్‌లను ఇప్పటికే మూడింటిని విక్రయించినట్టు జోయాలుక్కాస్‌ వారు చెబుతున్నారు. చూడ్డానికి 'మగధీర'లో హీరో వేసుకున్న కవచంలాగా కనిపిస్తున్నా ఇది మాత్రం నెక్లెస్సేనండోయ్‌!

  • Loading...

More Telugu News