: పాక్ లో భారతీయ చిత్రాల ప్రసారాలను నిలిపివేయండి: లాహార్ హైకోర్టు


దాయాది దేశం పాకిస్థాన్ టీవీ చానళ్లలో భారతీయ చిత్రాలు, సీరియళ్ల ప్రసారాలను నిలిపివేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. అంతేగాక ఇతర విదేశీ చిత్రాల స్క్రీనింగ్, సీరియల్స్, టెలివిజన్ షోల ప్రసారాలను కూడా ఆపివేయాలని చెప్పింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం, పాక్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారీటీ తమ వివరణలను రేపటిలోగా సమర్పించాలని నిన్నటి విచారణలో ఆదేశించింది. భారతీయ చిత్రాలు, సీరియళ్లు పాక్ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ గతనెల దాఖలైన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు పైవిధంగా స్పందించింది. ఇదిలావుంటే భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడిన నేపథ్యంలోనే ఈ విధంగా చేస్తున్నట్లు కొంతమంది అంటున్నారు.

  • Loading...

More Telugu News