: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు
కారులో గ్యాస్ నింపుతుండగా పేలుడు సంభవించింది. ప్రకాశం జిల్లా మార్కాపురం రామకృష్ణ కాలనీలో పెట్రోలు బంక్ వద్ద కారులో గ్యాస్ నింపుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో కారు సహా ప్రక్కనే ఉన్న ద్విచక్రవాహనం దగ్ధమైంది. ప్రక్కనే ఉన్న ఇంటికి కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. బంక్ కు ఏమీ కాకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.