: టాబ్లెట్స్ కన్నా డెస్క్ టాప్, ల్యాప్ టాపే బెస్ట్ అంటున్న యూత్: తాజా సర్వే


మార్కెట్ లోకి రకరకాల మొబైళ్లు వచ్చినా, కంప్యూటర్ మొబైల్స్ వచ్చినా యువత ఇప్పటికీ డెస్క్ టాప్, ల్యాప్ టాప్ కంప్యూటర్లనే ఎక్కువ ఇష్టపడుతోందని సర్వేలో వెల్లడైంది. 'టాబ్లెట్స్ యూసేజ్ అండ్ ఆడాప్షన్ ట్రెండ్స్ 2013' అంశంపైన సైబర్ మీడియా రీసెర్స్ ఇండియా (సీఎంఆర్) సంస్థ ఇరవైకి పైగా భారతీయ నగరాల్లో సర్వే చేసింది. ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వినియోగదారుల్లో ఎక్కువ శాతం టాబ్లెట్స్ కొనేందుకు మోజుపడుతున్నారని, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్, సమాచారాన్ని ఎప్పటికప్పుడు చూసుకునేందుకు టాబ్లెట్స్ సౌకర్యంగా ఉన్నాయని సర్వేలో తేలింది. అయితే 78 శాతం యువతరం మాత్రం తాము టాబ్లెట్స్ కన్నా డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లనే వినియోగించేందుకు ఇఫ్టపడతామని చెప్పడం విశేషం. సెప్టెంబరు - నవంబర్ 2013 లో మొత్తం 3600 మొబైల్ వినియోగదారులపై సర్వే నిర్వహించారు. ఆండ్రాయిడ్ టాబ్లెట్ వాడతామని 87 శాతం మంది చెప్పగా, ఐపాడ్ వినియోగిస్తామని 10 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా యువతరం చాటింగ్, మెసేజ్, ఈ-మెయిల్స్ కోసం టాబ్లెట్స్ వినియోగిస్తోందని సీఎంఆర్ ఇండియా సర్వే తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News