: మలేషియా వీసా ఇకపై మరింత సులభం


మలేషియా ప్రభుత్వం భారతీయులు, చైనీయులకు వీసాపై ఆంక్షలు సడలించింది. 2014లో మలేషియాను సందర్శించనున్న భారతీయుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ జహిద్ హమీది తెలిపారు. వీసా ఆన్ ఆరైవల్ (వీవోఏ) విధానం ద్వారా భారతీయులకు, చైనీయులకు మలేషియా ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ప్రస్తుతం పాస్ పోర్టు కలిగి ఉన్న భారతీయులు, చైనీయులు తమ పర్యటనకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

ఇంతకు ముందు 2010లో మలేషియా ప్రభుత్వం భారత్, చైనాతో పాటు మరో ఎనిమిది దేశాలకు వీఒఏ విధానం ద్వారా ఈ అవకాశం కల్పించింది. అప్పుడు కూడా వేలాది మంది పర్యాటకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ సౌకర్యం వల్ల ఇప్పటివరకు 39,000 మంది భారతీయులు, 6,000 మంది చైనీయులు మలేషియాను సందర్శించారని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News