: విభజన పాపం చంద్రబాబుదే: దేవినేని నెహ్రూ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా రెండు సార్లు లేఖలు ఇచ్చిన చంద్రబాబే విభజన నిర్ణయంలో తొలి ముద్దాయి అవుతారంటూ ఆయన ఆరోపించారు. కేంద్రం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం సీమాంధ్రకు 5 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్న బాబు.. ఇప్పుడు విభజనకు వ్యతిరేకమంటే జనం ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలు విభజన నిర్ణయానికి ముందే అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొనివచ్చుంటే ఇప్పడీ పరిస్థితి ఉండేది కాదన్నారు. విభజన బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించినా పార్లమెంటు ఆమోదిస్తే... అప్పుడు న్యాయపోరాటం ఒక్కటే మార్గమని దేవినేని పేర్కొన్నారు.