: పొన్నాలపై కేసు విచారణ రేపటికి వాయిదా
రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై హైకోర్టులో దాఖలైన ఎన్నికల అక్రమాల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. 2009 జనగామ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో పొన్నాల అవకతవకలకు పాల్పడ్డారని, రీకౌంటింగ్ జరిపించాలని కోరుతూ నాటి ఎన్నికలలో పోటీలో పాల్గొన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.