: సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జేడీయూ ఎంపీ
వ్యక్తిగత వాహనాలపై ఎర్రలైట్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి మాత్రమే పరిమితం చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఎంపీ అలీ అన్వర్ తప్పుబట్టారు. సుప్రీంకోర్టుకు వెరే పనేం లేదంటూ విమర్శించి సంచలనం సృష్టించారు. 'సుప్రీంకోర్టుకు వేరే పనేదీ లేనట్లు కనిపిస్తోంది. పేదలపై ప్రభావం చూపే ఎన్నో ముఖ్యమైన విషయాలకు బదులు ఎర్రలైట్లపై తీర్పు ఇచ్చింది. ఇది మంచిది కాదు' అని అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎర్రలైట్ల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.