: సల్మాన్ పెళ్లి ప్రతిపాదనపై ఎల్లీ కామెంట్
సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రతిపాదనను తాను సీరియస్ గా తీసుకోవడం లేదని 23 ఏళ్ల వర్ధమాన బాలీవుడ్ తార ఎల్లీ అబ్రహం తెలిపింది. సల్మాన్ తో అనుబంధం ఏర్పడేందుకు వీలుగా ఆయన గురించి ఏమంతగా తెలియదని పేర్కొంది. ఒకరినొకరు బాగా తెలుసుకున్న తర్వాత.. పరస్పరం గౌరవించుకోవాలని, విలువలు కలిగి ఉండాలని కొన్ని సూత్రాలు చెప్పుకొచ్చింది. షారూక్ ఖాన్ తన ఫేవరేట్ స్టార్ అని, దేవదాసు చిత్రమంటే ఎంతో ఇష్టమని తెలిపింది.