: నిఘా శునకానికి త్వరలో ఘన వీడ్కోలు
ఢిల్లీ నగరంలో ఎంతో మంది కరుడుగట్టిన స్మగ్లర్లను పట్టిచ్చింది. ఎన్నో బాంబుల జాడను పసిగట్టింది. ఎన్నో పతకాలను అందుకుంది. పదేళ్లపాటు విశిష్ఠ సేవలు అందించిన అను అనే ఆ శునకం ఈ నెలలోనే డాగ్ స్క్వాడ్ విధుల నుంచి తప్పుకోనుంది. ఏడు నెలల వయసున్నప్పుడు 2002లో డాబర్ మాన్ కుక్కపిల్లను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చిన తర్వాత డాగ్ స్క్వాడ్ లో చేర్చుకున్నారు.
నిఘా బృందంలో అను ఒక్కటే ఆడకుక్క. అయినా సరే, విధులను సమర్థవంతంగా నిర్వహించి ఢిల్లీ పోలీసుల మనసు చూరగొంది. ఈ నెలలో విధుల నుంచి వైదొలిగాక 11 ఏళ్ల అను సంరక్షణ బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టనుంది. మొత్తానికి అనుకు ఘన వీడ్కోలు పలకడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధమవుతున్నారు.